బెల్లంపల్లిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Published: Wednesday December 29, 2021
బెల్లంపల్లి డిసెంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కంకటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 137వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాన్ని మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కంకటి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి 25 మంది పార్టీ సీనియర్ నాయకులకు సన్మానం చేయడం జరిగిందని, పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన నాయకుల పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసిన గొప్ప గొప్ప పనులను పథకాలను కొనియాడారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీఅని, డ్యాములు కట్టి దేశాన్ని అభివృద్దిపదంలోకి నడిపించింది కాంగ్రెస్ పార్టీఅని, తెలంగాణ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఆయన తెలిపారు.