పూర్వీకుల మూలాలను నేటితరానికి పరిచయం చేయాలి: పెద్దపాక వెంకటేశ్వర్లు

Published: Tuesday April 26, 2022

బోనకల్, ఏప్రిల్ 25 ప్రజాపాలన ప్రతినిధి: మన పూర్వీకుల మూలాలను నేటితరానికి పరిచయం చెయ్యాలని, ఉమ్మడి కుటుంబాల వలనే విలువలుతో కూడిన జీవన విధానం సాధ్యమవుతుందని అదిశగా ముందుకు వెళ్లిన నాడే సామజిక భద్రత సంస్కృతి సంప్రదాయలకు విలువనిచ్చిన వారమవుతామని పెద్దిపాక వేంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం సాయంత్రం మండలంలో జానీకీపురం పి ఎన్ ఆర్ ఫంక్షన్ హల్ లో జరిగిన కార్యక్రమంలో అయన పాల్గొన్నారు, కాగా ఐదు తరాల కుటుంబాల ఆత్మీయులు అపూర్వ కలయిక ఆదివారం రాత్రి పి ఎన్ ఆర్ గార్డెన్ లో కనువిందు చేసింది. ఐదు తరాల ఆనవాళ్లును పెద్దలు గుర్తుచెసుకొంటూ తాత ముత్తాతల వంశ మూలాల జ్ఞాపకాలను, చరిత్ర సత్యాలను బందు మిత్రులకు తెలియజేసారు. ఆత్మీయుల సందడిలో మొహాలు మెరిసిన తారాజువ్వలా వెలుగుల హరివిల్లయి పలకరింపుల పులకరింతలో పరవళ్లు తొక్కిన వరద గోదారల్లే కనువిందు చేశారు. పిల్లకాలువను నది తనలో కలుపుకున్నట్టుగా ఆత్మీయ ఆలింగనంతో ఒకరికొకరు హక్కున చేర్చుకొన్నారు. ఆప్యాయతతో ముచ్చటించి కొందరు అభిమానపు జడివానలో తడిసి ముద్దయినారు. ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు 600 మంది అనూహ్య రీతిలో ఆత్మీయుల సమ్మేళనంలో పాల్గొన్నారు. మధ్య మధ్యలో చిన్న పిల్లలు నృత్యలతో సభా ప్రాంగణం మారు మ్రోగింది వెన్ను విరిచి విప్పారిన కంకిలా ఆప్యాయత, అనురాగాలు మధ్యన వారి మనసులు మురిసిపోయాయి. ఐదు తరాల క్రితం గార్లపాటి కోటయ్య బిచ్చమ్మ సంతానము ఇంతింటై వాటుడింటై అన్నట్టు గార్లపాటి, అంభోజీ, కోట, అంతోటి, పెద్దిపాక ఇంటిపేరుతో వటవృక్షమైన పలు కుటుంబాలను వేదికమీద కుటుంబాల వారీగా పరిచయం చేసి మెగా ఫ్యామిలీ ల ఫోటోలు దిగారు, నిర్వాహకులు, భోజన కార్యక్రమాల అనంతరం పెద్దలను ఘనంగా సన్మానించారు. నిర్వాహాక కమిటీ సభ్యులుగా అంతోటి తిరుపతిరావు, కోటము కుటుంబరావు, పెద్ద పాక.వెంకటేశ్వర్లు, కోట దావీద్, ఏం గల అమరయ్య, అంతోటి వెంకటేశ్వర్లు, అంతోటి సూర్యం, కోట శ్రీను, అంతొటి. శ్రీరాములు, అంబోజి. శ్రీను, గార్లపాటి. నాగేశ్వరావు మొదలగు వారు వ్యవహారించారు. ఈ కార్యక్రమంలో కలకోట సర్పంచ్ యంగల దయామణి, జానికిపురం సర్పంచ్ చిలక వెంకటేశ్వర్లు, ఐదు తరాల కుటుంబాలలో ఉద్యోగస్తులు, ఐదుతరాల పెద్దలు పిల్లలు వివిధ పదవులలో ఉన్నవారు పాల్గొన్నారు.