గిరిజన మహిళకు అరుదైన గౌరవం గిరిజన మోర్చా మండల అధ్యక్షులు భూక్య సైదా నాయక్

Published: Thursday June 23, 2022

బోనకల్, జూన్ 22 ప్రజాపాలన ప్రతినిధి: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించడం పట్ల బోనకల్ మండల కేంద్రంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో కి మండల బిజెపి నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ ఈ సందర్భంగా గిరిజన మోర్చా మండల అధ్యక్షులు భూక్య సైదా నాయక్, మండల అధ్యక్షులు వీరపనేని అప్పారావు, జిల్లా ఉపాధ్యక్షులు గూగులోతు నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న గిరిజన మహిళకు అరుదైన గౌరవం దక్కి రాష్ట్రపతిగా అభ్యర్థిగా ప్రకటించడం ఒక్క భారతీయ జనతా పార్టీకే సాధ్యం అని అన్నారు. ఒడిశాలోని బేడాపోసి గ్రామంలో జన్మించి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై చురుకైన నాయకురాలిగా పనిచేస్తూ కౌన్సిలర్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2సార్లు 2000- 2009 శాసనసభ్యులు గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేశారని 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్ గా ఐదు సంవత్సరాలు పూర్తి చేశారని అన్నారు. ఆమెకు విశేషమైన పాలనాపరమైన అనుభవం ఉందని దేశానికి అద్భుతమైన రాష్ట్రపతిగా పనిచేస్తారని ఒక సాధారణ కార్యకర్త నుండి రాష్ట్రపతి హోదా వరకు ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు గంగుల నాగేశ్వరావు ,అల్లిక కాశయ్య, యువ మోర్చా జిల్లా నాయకులు జర్పుల బాలకృష్ణ, యువ మోర్చా మండల అధ్యక్షులు కాలసాని పరుశురాం, బిజెపి యువనేత బిపి నాయక్ తదితరులు పాల్గొన్నారు.