సేంద్రీయ ఎరువు తయారు చేయాలి

Published: Tuesday October 19, 2021
మర్పల్లి మండల ఎంపిడిఓ వెంగట్రాంగౌడ్
వికారాబాద్ బ్యూరో 18 అక్టోబర్ ప్రజాపాలన : ప్రతి పల్లెలోని కంపోస్ట్ షెడ్డులో సేంద్రీయ ఎరువు తయారు చేయాలని మర్పల్లి మండల ఎంపిడిఓ వెంకట్ రాంగౌడ్ సూచించారు. సోమవారం వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని మర్పల్లి మండలానికి చెందిన పిల్లిగుండ్ల, గుండ్లమర్పల్లి గ్రామాలను సందర్శించి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె ప్రకృతి వనాలను గ్రామ పచాయతీల్లో అందంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఉపాధి హామీకి సంబంధించిన 7 రిజిష్టర్లను పరిశీలించి సూచనలు సలహాలు ఇచ్చామని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్ పూర్తిగా తొలగించి గచ్చకాయ మొక్కలు నాటాలని వివరించారు. ఎస్బిఎం షెడ్ లో తడి, పొడి చెత్తను వేరుచేసి సేంద్రియ ఎరువు తయారు చేయాలని తెల్పారు. రోడ్డు ప్రక్కన ఉన్న ఎవెన్యూ ప్లాంటేషన్ కొరకు రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించాలని అన్నారు. మొక్కల చుట్టూ సాసరింగ్ గుంతలు తవ్వి వైట్ పెయింట్ వేయించాలని కార్యదర్శి చంద్రశేఖర్ కు ఆదేశించారు. ఉపాధి హామీ రికార్డులను అప్ డేట్ చేయాలని సూచించారు. నేను తదుపరి పర్యటనకు వచ్చేటప్పటికే అప్ డేట్ చేయాలని కార్యదర్శిని ఆదేశించాడు. లేని యెడల చర్య తిసుకొనబడునని హెచ్చరించారు. అనంతరం గుండ్లమర్పల్లి వైకుంఠధామాన్ని సర్పంచుతో కలిసి పర్యవేక్షించారు. స్మశాన వాటికలో బుష్ క్లీన్ చేయడం జరిగిందని శివకుమార్ తెల్పారు. తడిపొడి చెత్తను ట్రాక్టర్ ద్వారా కంపోస్ట్ షెడ్ కు తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివకుమార్ గుండ్ల మర్పల్లి కార్యదర్శి చేంద్ర శేకర్  కారోబార్ నాజర్ తదితరులు పాల్గొన్నారు.