రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే శంకర్ నాయక్

Published: Saturday February 06, 2021
నెల్లికుదురు ఫిబ్రవరి 5(ప్రజా పాలన)ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతన్నలను గత ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకుకేవాడుకున్నారని,కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని మా ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగాఅన్నదాతల అభివృద్ధి కోసం పని చేస్తోందని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు.మండలంలోని చిన్న ముప్పారం రైతు వేదికను ఎమ్మెల్యే శంకర్ నాయక్ శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు నూతన వ్యవసాయ విధానాలను సాగులో మెళకువలు తొలగించడంతో పాటు రైతులకు సంబంధించిన ఇబ్బందులను సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి నివృత్తి చేయడానికి రైతు వేదికలు తోడ్పడతాయి అన్నారు.త్వరలోనే రైతు వేదికలకు స్మార్ట్ టీవీల తో పాటు ఇతర సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.కర్షకుల సంక్షేమం కోసం24 గంటలు కరెంటు,రైతు బంధు రైతు బీమా సబ్సిడీపై విత్తనాలు ఎరువులు అందించడంతోపాటు సాగునీరు కోసం అనేక ప్రాజెక్టులునిర్మించినట్లు తెలిపారు.అంతకుమునుపు నారాయణపురం మాజీ సర్పంచ్ పూకంటి యాకూబ్ రెడ్డి తమ గ్రామంలోని రైతులకు ఇంతవరకు పట్టాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేయడంతో స్పందించిన ఎమ్మెల్యే ఆ గ్రామ రైతులకు పట్టాలు ఇచ్చే బాధ్యత నాదని ఇనుగుర్తి మండలం గా ఏర్పాటు చేసే బాధ్యత కూడా నాదే అన్నారు.తాను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులు చేస్తున్నానని తనలాగా దేశంలోని ఏ ఎమ్మెల్యే కూడా ప్రజల కోసం నిరంతరం సేవ చేసేవారు లేరన్నారు.కొందరు గిట్టనివారు ఆరోపణలు చేస్తున్నారని వాటిని పట్టించుకోనన్నారు.నేను ఎమ్మెల్యేగా గెలిచిన అప్పటినుంచి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని అంతకు ముందు ఎవరూ చేయలేదన
 
Attachments ar