లోన్ యాప్స్ పట్ల జాగ్రత్త వహించాలి

Published: Thursday May 19, 2022
ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహజన్ ఐపిఎస్
 
మంచిర్యాల టౌన్, మే 18, ప్రజాపాలన : లోన్ యాప్స్ ప‌ట్ల ప్రజలను అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల‌ని మంచిర్యాల ఇంచార్జి డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలిపారు . ఈ యాప్‌ల విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని,  మొబైల్‌ సందేశాల్లో వచ్చే లింక్‌లను ఓపెన్‌ చేయవద్దని.యాప్‌ల ద్వారా మోసపోయినవారు ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదని సూచించారు.ఆన్‌లైన్ మోసాలు క్ర‌మంగా పెరుగుతున్నాయి అని లోన్ యాప్ ల మాయ‌లో ప‌డొద్ద‌ని సూచించారు. చాలా యాప్‌లు ఫోన్ ద్వారా రుణాలను అందిస్తూ అవసరమైన వ్యక్తులు వారి పరిచయాలను యాక్సెస్ చేయడానికి అనుమతులను అనుమతించడం ద్వారా అంగీకరిస్తారు. వారు  అధిక వడ్డీ రేటును వసూలు చేస్తారు, ఎవరైనా తిరిగి చెల్లించడంలో విఫలమైతే ఆలస్యం చేస్తే, వారు తమ కాంటాక్ట్‌లందరినీ సంప్రదించడం మెసేజ్ చేయడం ద్వారా వేధించడం ప్రారంభిస్తారు అని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే లోన్ యాప్స్ నుంచి రుణాలు తీసుకున్నవారిని వేధింపుల‌కు గురిచేయ‌డంతో పాటు భ‌య‌పెడుతూ. అధికంగా వ‌డ్డీ వ‌సూలు చేస్తున్నార‌ని హెచ్చిరించారు.