తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు...

Published: Wednesday April 28, 2021
బీరుపూర్, ఏప్రిల్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండలంలోని బీరుపూర్ తుంగర్ కొల్వాయి కమ్మునూర్ నర్సింహులపల్లి తదితర గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ జెండాలను ఎగరేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు నారపాక రమేష్ గ్రామశాఖ అధ్యక్షుడు పుడూరి సుధాకర్ ముప్పాల రాంచందర్ రావు ఘర్షకుర్తి శిల్పరమేష్ ముక్క శంకర్ కోలుముల రమణ నల్ల మహిపాల్ రెడ్డి ఏలుగందుల లక్ష్మీ అనిల్ రిక్కల ప్రభాకర్ పర్వతం రమేష్ గంగధరి సంతోష్ అజ్మీర ప్రభాకర్ బోడ సాగర్ ఏసుదాసు శీలం రమేష్ రామకిస్టు గంగాధర్ రామచంద్రమ్ గుండ సురేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.