13న రైతు శక్తి ప్రదర్శన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. -ధరణి తప్పులకు రైతుల అవస్థలు. -భారతీయ క

Published: Saturday November 05, 2022

చేవెళ్ల నవంబర్ 4 (ప్రజా పాలన):

రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ భారతీయ కిసాన్ సంఘ్ ఈనెల 13న నిర్వహించ తలపెట్టిన రైతు శక్తి ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  భారతీయ కిసాన్  సంగ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గడికి గజేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘ్  గోడ ప్రతినిరైతులతో కలిసి  విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని ఇప్పటికి పూర్తి చేయలేదని అన్నారు.  24 గంటల విద్యుత్ సప్లై అన్నది బూటకపు మాట అని ఆయన ఎద్దేవా చేశారు.  పంటల భీమా పథకాన్ని కావాలని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నట్లు ఆరోపించారు.  వన్యప్రాణుల సంరక్షణ పేరుతో రైతులు తమ పంటలను కోల్పోతున్నారని నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. ధరణి పేరుతో అనేక రెవెన్యూ సమస్యలు ఏర్పడుతున్నాయని ధరణిలో జరిగిన తప్పులకు ప్రభుత్వ బాధ్యత వహించాలని తేల్చిచెప్పారు.  రాష్ట్రవ్యాప్తంగా భూముల ఫిజికల్ సర్వే పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన  డిమాండ్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తులను ఖర్చుల ఆధారంగా ఇవ్వాలని అన్నారు.  ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్న తీరు సరికాదని చెప్పారు.  ఈ కార్యక్రమంలో చేవెళ్ల మండల అధ్యక్షులు పెంటారెడ్డి కార్యదర్శి ఈశ్వరప్ప వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.