సీసీ కెమెరాలకు సొంత డబ్బులు ఇస్తున్న కార్పొరేటర్

Published: Tuesday October 12, 2021
బాలాపూర్, అక్టోబర్ 11, ప్రజాపాలన (ప్రతినిధి) : బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెండో డివిజన్ అల్మాస్గూడలో కె ఎం ఆర్ అపార్ట్మెంట్ సిసి కెమెరాల కు తన సొంత డబ్బులు స్థానిక కార్పొరేటర్ పద్మా ఐలయ్య యాదవ్ పదివేల రూపాయలు అది అపార్ట్ మెంట్ లో ఉన్న సభ్యులకు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.... అపార్ట్మెంట్ లో కొత్తవాళ్ళు వచ్చిన గుర్తుపట్టడానికి ఉందని అన్నారు. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఏలాంటి సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఉండడంవల్ల చాలా మేలు అని అన్నారు. ఈ కార్యక్రమం లో అపార్ట్మెంట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.