సీతరాములకు పట్టువస్త్రాలు సమర్పించిన - మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి

Published: Thursday April 22, 2021
జగిత్యాల, ఏప్రిల్ 21 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని శ్రీరామ నవమి పండుగ సందర్భంగా శ్రీ భక్తమార్కండేయ స్వామి ఆలయంలో శ్రీ సీతరాముల కళ్యాణ మహోత్సవానికి జగిత్యాల పట్టణ ప్రజల తరపున పట్టు వస్త్రాలను మున్సిపల్ ఛైర్పర్సన్ డా.బోగ శ్రావణి ప్రవీణ్ దంపతులు స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దాసరి లావణ్య ప్రవీణ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.