క్రీడాకారినులకు షూస్ పంపిణి చేసిన సీఐ కే. బాబు రావు

Published: Tuesday September 06, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 5 ప్రజా పాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా  తాళ్ళగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతి బాపు పూలె స్కూల్ విద్యార్థినిలకు తాళ్ల గురజాల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబురావు విద్యార్థినిలకు పరిగెత్తే అందుకు ఉపయోగపడే" షూస్ " ను సోమవారం బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో నైపుణ్యం ప్రదర్శించడంలో విద్యార్థినీలు ముందున్నప్పటికీ వారి ఆర్థిక పరిస్థితులు బాగులేక షూస్ లేక వట్టి కాళ్ళ తో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వారిని గుర్తించిన  బెల్లంపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కోట బాబురావు, తాళ్ల గురజాల ఎస్సై రాజశేఖర్, బెల్లంపల్లి టౌన్ ఎస్ఐ ఆంజనేయులు, నేన్నల్ ఎస్ఐ రాజశేఖర్ లు  వారిని కార్యాలయంకి పిలిపించి సోమవారం క్రీడాకారులకు 15 జతల స్పోర్ట్స్ షూస్ అందజేశారు. 
క్రీడాకారులకు ఆర్థిక పరిస్థితులు అడ్డు కాకూడదని, యువత చదువుతో పాటు క్రీడల్లో ప్రధాన భూమిక పోషించాలని అన్నారు.క్రీడల్లో రాణించే యువతీ, యువకులకు తమ వంతుగా సహాయం అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని ఆయన తెలిపారు.
 
 
 
Attachments area