తిమ్మారావుపేట ఓం గాయత్రి స్కూల్లో.. గణిత వేదిక ట్యుటోరియల్ ప్రారంభం..

Published: Tuesday September 27, 2022
ఏన్కూరు, సెప్టెంబర్ 26 (ప్రజాపాలన న్యూస్): ఏన్కూర్
మండలంలోని తిమ్మరావుపేట గ్రామంలో ఓం ఆదిత్య గాయత్రి స్కూల్ యాజమాన్యం  నిర్వహిస్తున్న గణిత వేదిక ట్యూటోరియల్ ని సాంఘిక సంక్షేమ గురుకుల విశ్రాంతి జాయింట్ సెక్రటరీ పి. భరత్ బాబు ప్రారంభించారు.
ఆయనతోపాటు విశ్రాంతి ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి షేక్ అసఫ్ అలీ, ఏన్కూర్ యస్ ఐ సాయి కుమార్,  గ్రామ సర్పంచ్ అరేం సుహాసిని  హాజరైయ్యారు. ఈ సందర్భంగా  భరత్ బాబు మాట్లాడుతూ
 ట్యూటోరియల్ నిర్వాహకుడిగా వృత్తిని ప్రారంభించి గురుకుల జాయింట్ సెక్రటరీ గా పదవి విరమణ పొందానని, తన వద్ద విద్యార్ధిగా చదివి పాఠశాల కరెస్పాండంట్ గా ఎదిగినందుకు ప్రిన్సిపాల్ దాసరి రమేష్ ని అభినందించారు.
విద్యార్థులకు చదువు, నిద్ర, ఆరోగ్యం తో పాటు క్రమశిక్షణ ఉంటేనే లక్ష్యాన్ని సాధిస్తారని, విద్యార్థులు క్రమశిక్షణ తో పెరగాలని తెలిపారు.
 జిల్లా విశ్రాంతి జిల్లా విద్యాశాఖాధికారి షేక్ అసఫ్ అలీ, ఏన్కూర్ యస్ ఐ. సాయి కుమార్  మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు స్పోర్ట్స్,సైనిక్ స్కూల్ లో సీట్లు సాధించడం గర్వించదగినదని, విద్యార్థులు మరింత ఫలితాలు సాధించేలా శిక్షణ ఇవ్వాలని కోరారు. అనంతరం విద్యార్థులతో కలసి అతిధులు బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు.