గుడ్ న్యూస్ స్కూల్ చర్చీ లో ఘనంగా మట్టల ఆదివారం

Published: Monday April 03, 2023

అశ్వారావుపేట ప్రజా పాలన (ప్రతినిధి) అశ్వారావుపేట మండలంలోని స్థానిక గుడ్ న్యూస్ స్కూల్ చర్చి లో భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారము స్థానిక రెవరెండ్ ఫాదర్ జోషి,సహయ గురువులు ఫాదర్ టోనీ ప్రసన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ 40 రోజుల శ్రమల కాలంలో భాగంగా గుడ్ ఫ్రైడే కి ముందుగా మట్టల ఆదివారాన్ని నిర్వహిస్తారు.మట్టలు పట్టుకోని హోసన్నా జయము స్వామికి శతతం అని పాడుకుంటూ భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా చర్చి దగ్గరికి వెళతారు.ఈ యొక్క కార్యక్రమాంల్లో మండలంలోని పేరాయి గూడెం, నెహ్రు నగర్, అచ్చుతాపురం గాండ్లగూడెం నుండి భక్తులు, సిస్టర్స్ డెల్బీ,రోస్లీ, ఫాదర్ దీపక్ మరియు పాస్టర్లు డి చార్లెస్, జోసెఫ్, డి శ్యామ్, సంఘ పెద్దలు జుజ్జారపు రాంబాబు, కొనకళ్ళ శేఖర్, తగరం నిర్మల, అప్పారావు, ప్రసాద్, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.