బాల్య వివాహాలు నిర్మూలించడమే లక్ష్యం

Published: Wednesday June 16, 2021
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జూన్ 15 ప్రజాపాలన బ్యూరో : కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో బాల్య వివాహాలు తగ్గాయని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో లబ్ధిదారులకు రూ.1,54,17,864 (ఒక్క కోటి యాభై నాలుగు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు) విలువ గల 154 కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... పార్టీలకతీతంగా పైసా లంచం ఇవ్వకుండా నిరుపేదలైన ఎంతో మంది ఈ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందుతున్నారని గుర్తు చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రతి పథకంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్ లను మహిళలకు ప్రభుత్వం అందిస్తుందన్నారు. బంగారు తెలంగాణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. లాక్ డౌన్ వలన ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ పేదవారికి అందే సంక్షేమ పథకాలు మాత్రం ఎక్కడ ఆగకుండా సీఎం కేసీఆర్ పకడ్బందీగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిండు నూరేళ్లు బతకాలని దీవించాలని కోరారు. 
రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం :
కరోనా కష్టకాలంలో రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతు బంధు పథకం కొనసాగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం  మోమిన్ పేట్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రానున్న రోజుల్లో దాదాపు 63.25 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. సిఎం ఎల్లవేళలా రైతుల సంక్షేమం కోసం ఆలోచిస్తారని గుర్తుచేశారు. రైతు బంధు, రైతు భీమా, ఉచిత విత్తనాలు, యాంత్రీకరణ పనిముట్లు, పంట దిగుబడి కొనుగోలు... ఇలా ఎన్నో ఆదర్శవంతమైన పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఏ పథకంలోనూ మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది అన్నారు. ప్రత్యేకంగా రైతుల కోసం ఒక వేదిక పై చర్చించుకోవడానికి రైతుల కోసం రైతు వేదికలను అతి తక్కువ సమయంలో నిర్మించారన్నారు. ప్రతి రైతు వేదికలో వ్యవసాయ  అధికారి నియమించి రైతుల సమస్యలను వెంటనే పరిష్కారం అవుతున్నాయన్నారు. రైతులు అధిక లాభాలు గడించాలని పండ్లతోటల పెంపకానికి మన ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు అమలుచేస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్ పి వైస్ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీ వసంత, పిఏసిఎస్ చైర్మన్లు అంజి రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు, చీమలదరి సర్పంచ్ మాసన్ పల్లి నర్సింహ రెడ్డి, రైతు బంధు అధ్యక్షులు విఠల్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ లక్ష్మయ్య, ఎమ్మార్వో  శ్రీనివాస్ రెడ్డి, ఎంపిడిఓ శైలజ, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.