పుట్టినరోజు సందర్భంగా నడవలేని వారికి వాకర్స్ పంపిణీ

Published: Thursday June 09, 2022
బోనకల్, జూన్ 8 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని బుధవారం బహుజన్ సమాజ్ పార్టీ బోనకల్ మండల అధ్యక్షుడు గంధం వంశీ పుట్టినరోజు సందర్భంగా నడవలెని వారికి వాకర్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మధిర అసెంబ్లీ ఉపాధ్యక్షుడు దామెర్ల పృద్వి, జిల్లా ఐటీ సెల్ అధ్యక్షుడు కనక పూడి కళ్యాణ్, బి వి ఎఫ్ మండల అధ్యక్షుడు తడికమల్ల మనోజ్ కుమార్, గార్లపాడు గ్రామ కన్వీనర్ కనకపూడి కోటి, గార్లపాడు జనసేన విద్యార్థి విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంధం ఆనంద్, గోళ్లమందల తేజ, ఇరుగు రాకేష్, కనకపూడి నాగేశ్వరరావు, ఇరుగు కృష్ణ తదితరులు పాల్గున్నారు.