27న జరిగే భారత్ బంద్ ను జయప్రదం చేయండి అఖిలపక్షం

Published: Tuesday September 21, 2021

మధిర, సెప్టెంబర్ , ప్రజాపాలన ప్రతినిధి : అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ నెల 27వ తారీఖున జరిగే భారత బంద్ ను జయప్రదం చేయాలని స్థానిక సిపిఎం పార్టీ ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని, గ్యాస్ డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకాలను నిలిపివేయాలని కార్మిక వ్యతిరేకంగా ఉన్న కోడులను రద్దు చేయాలని, తదితర డిమాండ్లతో జరిగే భారత్ బంద్ ను జయప్రద కోరుతూ మధిరలో వ్యాపారవర్గాలు, కార్మికులు  ఉద్యోగ, ఉపాధ్యాయులు,  ప్రభుత్వ ప్రైవేట్రంగ సంస్థలు, సంఘటిత అసంఘటిత కార్మికులు  , అఖిలపక్షం నాయకులు ,తదితరులు ఈ బంద్ లో పాల్గొనాలని తెలిపారు. భారత బంద్ కు సన్నాహకంగా 25 వ తారీఖు న సాయంత్రం జరిగే మోటార్ సైకిల్ ర్యాలీలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అఖిలపక్షం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ టౌన్ కార్యదర్శి శీలం నర్సింహారావు, టౌన్ కమిటీ సభ్యులు తేలప్రోలు రాధాకృష్ణ, పడకంటి మురళి, పి.వెంకట్రావ్, వి.మధు, m.ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు ఎస్  కె బాజీ, ఆదిమూల శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు చావా వెంకటేశ్వరరావు, పెరుమాళ్లపల్లె ప్రకాష్రావు, మంగళగిరి రామాంజినేయులు, టిడిపి నాయకులు m.పుల్లారావు, గడ్డం మల్లిఖార్జునరావు, అఖిలపక్షం నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.