దళితుల ఆర్థిక అభివృద్ధి కే దళిత బందు పథకం..... --ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్.

Published: Thursday January 12, 2023

జగిత్యాల, జనవరి 11 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టనములో  కళ్యాణ లక్ష్మి,సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ లో భాగంగా మోచి బజార్ లో ఇటీవల పి రాజయ్య కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన పుట్ వేర్ షాప్ ను  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ సందర్శించినారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ దళితుల జీవితాల్లో వెలుగులు నింపి భావితరాలకు బంగారు బాట వేయాలనే సంకల్పంతో  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని ఎమ్మేల్యే సంజయ్ కుమార్  అన్నారు. దళితులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు దళిత బంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి  దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని అన్నారు. దళిత బంధు పథకం ద్వారా  ఒక్క రూపాయి కూడా బ్యాంకు లోన్ లింకేజీ లేకుండా 10 లక్షల రూపాయలను నేరుగా దళితుల అకౌంట్లలో జమ చేయడం జరిగిందన్నారు. దళితులు వారు కోరుకున్న రంగాల్లో ఎదిగేందుకు మంచి యూనిట్లను ఎంచుకొని ఆర్థిక సాధికారత సాధించాలన్నారు.  రాజేష్ దళిత బందును సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం  కావాలన్నారు.  రాబోయే రోజుల్లో అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని  అన్నారు.