ఉపాధి కూలీలకు పెండింగ్లో ఉన్న ఏడువారాల బిల్లులను వెంటనే విడుదల చేయాలి.

Published: Tuesday April 19, 2022
ఇబ్రహీంపట్నం ఎప్రిల్ 18 ప్రజాపాలన ప్రతినిధి : సోమవారం ఇబ్రహీంపట్నం ఎంపీడీవో కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఇబ్రహీంపట్నం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవిలో ఉపాధి కూలీలు పనులు చేసిన ఏడు వారాలుగా బిల్లులు రాకపోవడంతో కూలీలు ఇబ్బంది పడుతున్నారని కూలీలకు ఇచ్చే మాస్టర్ ఇంగ్లీషులో రావడంతో అర్థం కాక కూలీలు ఇబ్బంది పడుతున్నారని వెంటనే మాస్టర్ ని తెలుగులో ఇవ్వాలన్నారు పనిచేసిన కూలీలకు గతంలో ఇచ్చినట్లు పే స్లిప్పులు ఇవ్వాలి. ఎండలు విపరీతంగా ఉన్నందున పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు మంచినీరు నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధి పని లో కూలీలు పని కోసం దరఖాస్తు చేసిన తర్వాత ఆ కూలి పని కి వెళ్లకపోయినా పని రోజులు తగ్గించటం సరైనది కాదన్నారు. కూలీలకు మెడికల్ కిట్లు మరియు పని సామాగ్రి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  అనంతరం ఎంపీడిఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మీసాల లింగస్వామి, రమేష్, బుగ్గ రాములు, గణేష్, జగన్, శ్రీకాంత్, యాదగిరి, విగ్నేష్, మరియు ఉపాధి కూలీలు పాల్గొనడం జరిగింది.