క్షయ వ్యాది రహిత సమాజమే మన లక్ష్యం : వైస్ చైర్మన్ శీలం విద్య లత

Published: Saturday October 09, 2021
మధిర, అక్టోబర్ 08, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం రూరల్ గ్రామపంచాయతీ పరిధిలో ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారినణి డా మాలతీ మేడం మరియు జిల్లా క్షయ నివారణ అధికారి  డా వరికూటి సుబ్బారావు ఆదేశాలు మేరకు పిహెచ్సి దెందుకూరు పరధిలో మడు పల్లి గ్రామoలో లైబ్రరీ సెంటర్ లో క్షయ నిర్ధారణ పరీక్షలు మరియు అవగాహనా కార్యక్రమం చేపట్టినారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిద పారామెడికల్ సిబ్బందితో పాటు వార్డు కాన్సిలర్ మధిర మున్సిపాల్టీ 5వ వార్డ్ శ్రీమతి శీలం విద్య లత వెంకటరెడ్డి,6వ వార్డ్ తొగరు వరలక్ష్మి ఓంకార్, 7వ వార్డ్ మేడికొండ కళ్యాణి కిరణ్ పాల్గొని క్యాంపు విజయవంతo చేసారు ఈ సందర్బంగా విద్య లత మేడం మాట్లాడుతూ టీబీ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు ముందు ఉండాలని తెలియజేసినారు. అదేవిధంగా టీబీ చిత్ర పటాలను టీబీ నోడల్ పర్సన్ లంకా కొండయ్య ఏర్పాటు చేయగా వాటిని ప్రదర్శించినారు. 30మందికి టీబీ లక్షణాలు వున్న వారికి కళ్ళే తేమడా పరీక్షనిమిత్తం సేకరించి తెలంగాణ T హబ్ కు పంపినారు. గ్రామంలో వున్న టీబీ కేసులును గుర్తించి వారికీ ఆరోగ్యసూత్రలు బోధించారు. ఈ కార్యక్రమంలో మధిర  టీబీ యూనిట్ సీనియర్ చికిత్స పరివేక్ష కుడు N సందీప్ ల్యాబ్ సూపర్ వైజర్ శివ  పిహెచ్సి దెందుకు రు టీబీ నోడల్ అధికారి లంకా కొండయ్య  హెచ్స్ కాంతలీల ఎఎన్ఎం సునీల రాణి నాగేశ్వరావు ఆశ లు s అరుణ N అరుణ సునీత నిర్మల పారి శుధ్య కార్మికులు పాల్గొన్నారు.