ఘనంగా ఎంపిపి ఉమామల్లారెడ్డి జన్మదిన వేడుకలు

Published: Thursday March 18, 2021
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం, మార్చి 17, ప్రజాపాలన : మండలంలోని పెద్దముప్పారం గ్రామంలో అమ్మ ఓడి అనాధ వృద్దాశ్రయంలో బుధవారం మల్లం ప్రవీణ్  ఆధ్వర్యంలో ఎంపిపి ఓలాద్రి ఉమామల్లారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లను, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ మండల అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఎంపిపి ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని వృద్దాశ్రయంలో వృద్ధుల సమక్షంలో జన్మదిన వేడుకలను నిర్వహించామని, వృద్ధులు దీవెనలు ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి కొండ లింగమల్లు, ధర్మారపు హరీష్, నానబాల యాకన్న, మధు తదితరులు పాల్గొన్నారు.