జూలై 8 న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ వారి సమీక్ష సమావేశాలు

Published: Friday June 25, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి 24వ తేదీ మున్సిపాలిటీ ఈరోజు మధిర నియోజకవర్గంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిశీలకులు నాడెం శాంతి కుమార్ ముఖ్య అతిథులుగా హాజరైన సందర్భంలో మధిర నియోజవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం భరత్ విద్యాసంస్థల క్యాంపస్ ఆవరణలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి భారతి విద్యా సంస్థల అధినేత మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు శీలం వెంకట రెడ్డి గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నాడెం శాంతకుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలే ప్రజా మాన్ ఫ్యాక్ట్ గా రూపాంతరం చెందే విధంగా ప్రజల సమస్యలపై మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకొని బడుగు బలహీన వర్గాల రైతు శ్రామిక వర్గాల మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం వారి ఆకాంక్ష నెరవేరే విధంగా మ్యాన్ ఫ్యాక్ట్ రూపొందుతుందని ప్రస్తుతం తెలంగాణలో గడీల పాలన నియంత పాలన కుటుంబ పాలన సాగుతోందని తెలంగాణ సాధన కోసం ఆనాడు ఉద్యమస్ఫూర్తితో అనేకమంది బలి దానం చేయడం వల్ల తెలంగాణ సాకారం అయిందని నీళ్లు నియామకాలు నిధులు అని ఆశపడి భావితరాల అభ్యున్నతి కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ నేడ కెసిఆర్ కుటుంబ పాలనగా మారిందని దీనికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు రాబోయే రోజుల్లో షర్మిలమ్మ నాయకత్వంలో అనేక సమస్యలపై కాల్ చేయడానికి సమస్యల పరిష్కారానికి షర్మిల నాయకత్వాన్ని బలపరిచే విధంగా తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన యావత్ తెలంగాణ ప్రజానీకం మొత్తం నడవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం అదే సందర్భంలో ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో షర్మిల నాయకత్వంలో తెలంగాణ పార్టీ ముందు వరుసలో ఉంటుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో భరత్ విద్యా సంస్థల అధినేత శీలం వెంకట రెడ్డి గారు లక్కినేని సుధీర్ బాబు టీ కృష్ణమోహన్ ఎస్ నాగేశ్వరరావు శీలం చెన్నారెడ్డి నాతరి రంజిత్ మాజీ జిల్లా చైర్పర్సన్ శ్రీమతి గూడవల్లి కవిత శ్రీమతి చల్లా ప్రతిభ రెడ్డి శ్రీమతి రాములమ్మ శ్రీమతి కర్నాటి పద్మ శ్రీమతి కొప్పుల విజయ వైరా నియోజకవర్గ నాయకులు రాములు నాయక్ మద్దెల ప్రసాద్ పిల్లి పుల్లయ్య వేమి రెడ్డి మల్ల రెడ్డి గూడూరు రమణారెడ్డి ఐ లూరిఉమా మహేశ్వర్ రెడ్డి ఎస్.కె మౌలాలి వాకా వీరారెడ్డి సామినేని రవి ఎస్కే మస్తాన్ భాష ఇస్మాయిల్ శివ జానకి రామ్ ఇరుగు జ్ఞానేశ్వర్ ఆళ్ల మోహన్ రావు నాగ వేణు ఉడుగు సుధాకర్ జల్లేపల్లి సైదులు ఇస్లావత్ రాంబాబు నాయక్ శీలం వెంకట కిరణ్ రెడ్డి తదితర ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు