పాప ప్రాణాలు కాపాడిన బెన్సన్ అభినందించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి

Published: Wednesday August 25, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 25 ప్రజా పాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం బస్ స్టాప్ సమీపంలో సోమవారం గుర్తుతెలియని 3రోజుల పసికందును వదిలేసి వెళ్లగా కుక్కలు పీక్కుతుంటూ, బెన్సన్ గమనించి, స్థానిక పోలీస్ లకు అప్పగించడం జరిగింది. చిన్నారి పాప ప్రాణం కాపాడినందుకు బెన్సన్ ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో యాచారం మండల తెరాస అధ్యక్షులు కర్నాటి రమేష్ గౌడ్, PACS చైర్మన్ రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్, కాజు, మొహమ్మద్, భీమ్, రవీందర్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.