భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Published: Thursday September 30, 2021
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 29 సెప్టెంబర్ ప్రజాపాలన : భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ లు సంయుక్తంగా హితవు పలికారు. బుధవారం  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్లతో కలిసి వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి గ్రామంలో మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వికారాబాద్ మండలం లోని పులుసుమామిడి గ్రామం దగ్గర నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో వాగు ఉధృతంగా ప్రవహించింది. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు వరద ప్రవాహంలో పులుసుమామిడి గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్ ఇసాక్ పాష ప్రమాదవశాత్తు వరద  నీటిలో గల్లంంతైన విషయం తెలిసి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వపరంగా అన్ని విధాల వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతుని భార్యకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగం కల్పించాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, మండల పార్టీ అధ్యక్షుడు కమాల్ రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు నూలి శుభప్రద్ పటేల్, విద్య మౌలిక వసతుల కల్పనల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఎస్పీ సంజీవరావు, ఆర్డిఓ ఉపేందర్ రెడ్డి, ఎంపిడిఓ సుభాషిణి, డిటి యాదయ్య, వికారాబాద్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు గయాజ్, పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.