సంత్ సేవాలాల్ చూపిన ఆశయాలు ఆదర్శనీయం జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మంచిర్యాల బ్యూరో, ఫిబ్ర

Published: Wednesday March 01, 2023
సంత్ సేవాలాల్ మహరాజ్ చూపిన ఆశయాలు ఆదర్శనీయమని, ప్రతి ఒక్కరు తమ నిత్య జీవితంలో ఆచరించదగిన అంశాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం సంత్  సేవాలాల్ మహరాజ్ 284వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా నుండి ఎఫ్.సి.ఎ. కమ్యూనిటీ హాల్ వరకు సంప్రదాయ నృత్యాలతో ర్యాలీ నిర్వహించారు. ఎఫ్.సి.ఎ. కమ్యూనిటీ హాల్ ల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి.మధుసూదన్ నాయక్, బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్యతో కలిసి హాజరయ్యారు. సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ చూపిన మార్గం ఆదర్శనీయమని అన్నారు. 1739లో జన్మించిన సేవాలాల్ ఆచరించి మార్గాన్ని ప్రతి ఒక్కరు తమ నిత్య జీవితంలో అమలు చేసినప్పుడు ఆ మహనీయుడికి నిజమైన నివాళి అర్పించినవార మవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, సేవాలాల్ ఉ త్సవ కమిటీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.