ఆదివాసీ మహిళలకు అండగా ఉంటా .. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ .

Published: Thursday June 09, 2022
మంచిర్యాల బ్యూరో, జూన్08, ప్రజాపాలన:
 
అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించిన ఆదివాసీ గిరిజనులకు అండగా ఉంటానని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ  అన్నారు. బుధవారం జైలు నుంచి బెయిల్ పై విడుదలైన ఆదివాసీ గిరిజనులను  కలిసి వారికి పూలదండ వేసి  గిరిజన సంప్రదాయం ప్రకారం  ఘనంగా స్వాగతం పలికారు.   కుటుంబ సబ్యులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దండేపల్లి మండలం మాకులపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కోయ పోషగుడేం కు చెందిన ఆదివాసీలు వారికి అనాదిగా వస్తున్న పోడు భూములు సాగు చేసుకుంటే వారికి హక్కు పత్రాలు ఇవ్వాల్సింది పోయి తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు తరలించారని ఆరోపించారు. ఆదివాసీ మహిళలు అని కూడా చూడకుండా 12 మంది  మహిళలను అరెస్ట్ చేసి జైల్ కు పంపినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ద్దుచ్చర్య ను కండిస్తున్నానని అన్నారు. తమకు సంబంధించిన భూముల కు పట్టాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. హక్కు పత్రాలు ఇచ్చే దాక ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.
 ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆదివాసీ గిరిజనులు పాల్గొన్నారు.