సంక్రాంతి పండుగ సందర్భంగా అళ్ళపాడులో ముగ్గులు పోటీలు

Published: Monday January 17, 2022

బోనకల్ జనవరి 16 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్ళపాడు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ మహిళలకు మన గ్రోమోర్, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా మన గ్రోమోర్ మేనేజర్ మరీదు పుల్లయ్య మాట్లాడుతూ గ్రామంలోని రైతులు అందరూ పాడిపంటలతో కళకళలాడాలని, సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. అనంతరం ఈ ముగ్గులు పోటీలో గెలుపొందిన వారికి గ్రామ సర్పంచ్ మరియు తిరుపతి రావు చేతులమీదుగా బహుమతులు ఇవ్వడం జరిగింది. మొదటి బహుమతి ఏసు జ్యోతి, రెండో బహుమతి వెంకటేశ్వరమ్మ, మూడో బహుమతి అల్లిక వెంకటలక్ష్మి మరియు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మర్రి తిరుపతిరావు, సిపిఎం సీనియర్ నాయకులు బండి నాగేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకులు తోటకూర వెంకటేశ్వరరావు, విద్యా కమిటీ చైర్మన్ బండి పుల్లయ్య, డివైఎఫ్ఐ కార్యకర్తలు మరీదు శ్రీను, శ్రీకాంత్ అర్వపల్లి నరేష్, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు మర్రి సాయికుమార్, కొంచెం నవీన్, మన గ్రోమోర్ మేనేజర్ మరీదు పుల్లయ్య మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.