థ్రోంబెక్టమీలో అత్యాధునిక చికిత్సతో యువకుడి ప్రాణాలు కాపాడిన బేగంపేట్ మెడికవర్ హాస్పిటల్

Published: Saturday February 11, 2023
బ్రెయిన్ స్ట్రోక్ తో ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యక్తికి ఎటువంటి సర్జరీ లేకుండా స్టంట్ వేసి రోగి ప్రాణాలను కాపాడారు బేగంపేట్ మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్లు.ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న అజయ్ కుమార్ అనే 32 సంవత్సరాల వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడి ప్రాణాపాయస్థితికి చేరుకోగా   వెంటనే తన సహోద్యోగులు హుటాహుటిన బేగంపేట్ లోని మెడికవర్ హాస్పిటల్స్ కి తరలించారు.ఎం ఆర్ ఐ స్కాన్ లో తనకి మెదడులో చిన్న రక్తపు  గడ్డ ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు చీఫ్ న్యూరో సర్జన్ డాక్టర్ రణధీర్ కుమార్ ఆధ్వర్యంలో సర్జరీ అవసరంలేకుండానే మినిమల్లి ఇన్వేసివ్  పద్దతిలో స్టెంట్ (కాథెటర్ సక్షన్ మరియు స్టెంట్ రిట్రీవర్‌లను ఉపయోగించి మెకానికల్ థ్రోంబెక్టమీ) చేసి రోగిని కాపాడారు.  
 
ఈ సందర్భంగా డాక్టర్ రణధీర్ కుమార్  మాట్లాడుతూ తీవ్రమైన స్ట్రోక్ అనేది సెరెబ్రోవాస్కులర్ ఎమర్జెన్సీ అని,దీని కారణంగా మెదడుకు రక్త సరఫరాలో ఆకస్మిక అంతరాయం కలుగుతుందన్నారు.తీవ్రమైన స్ట్రోక్ చికిత్సలో సమయం కీలకమని గంట నుండి 3 గంటల విండో పీరియడ్ ఇంట్రావీనస్ టి పి ఎ (టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్ లేదా సింపుల్ క్లాట్ బస్టర్ మెడిసిన్)తో థ్రాంబోసిస్‌కు అనుకూలంగా ఉంటుందని, 3 గంటలకు మించి క్లాట్ బస్టర్ ఔషధం యొక్క పరిమిత పాత్ర ఉందన్నారు. మెకానికల్ థ్రోంబెక్టమీ అనేది యాంటీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్‌లో 6 గంటల వరకు పృష్ఠ ప్రసరణలో మంచి ఫలితాలతో 12 గంటల వరకు తీవ్రమైన స్ట్రోక్‌కు సరైన సమయంగా తెలిపారు.  ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పేషెంట్ ని గంట నుంచి మూడుగంటల లోపు  వ్యవధిలో హాస్పిటల్ కి తీసుకోని రాగలిగితే పేషెంట్ కి సర్జరీ అవసరం లేకుండా స్టంట్ వేసి కాపాడవచ్చు అని అన్నారు. 
 
మెడికవర్ హాస్పిటల్స్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ కుమార్ కైలాసం, సెంటర్ హెడ్ డాక్టర్ హృషీకేశ్  లు మాట్లాడుతూ అక్యూట్ బ్రెయిన్ ఎమర్జెన్సీని ప్రోటోకాల్ ఆధారిత చికిత్స ఇవ్వడం ద్వారా రోగి ప్రాణాలను కాపాడవచ్చు. మెడికవర్ హాస్పిటల్స్ లో అన్ని రకాల స్ట్రోక్ ఆధారిత ప్రొటొకాల్స్ ని పాటిస్తూ అత్యవసర పరిస్థితులలో అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తున్నామని అన్నారు . ఈ సందర్భంగా సమగ్రమైన స్ట్రోక్ సెంటర్ కలిగిన మెడికవర్ హాస్పిటల్స్ బేగంపేట లో ఇటువంటివి  సాధ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ న్యూరోసర్జన్ డాక్టర్ రణధీర్ కుమార్, మెడికల్ డైరెక్టర్ సతీష్ కైలాసం,  న్యూరోఫిజిషియన్ డాక్టర్ గౌసుద్దీన్ , సెంటర్ హెడ్ హృషీకేశ్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.