ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వెంటనే తెరిపించాలి. జువ్వాడి బ్రదర్స్

Published: Thursday February 23, 2023
కోరుట్ల, ఫిబ్రవరి 22 (ప్రజాపాలన ప్రతినిధి):
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ కర్మాగారం మూసివేసి నేటికి ఎనిమిది సంవత్సరాల రెండు నెలల అవుతుందని కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు. టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణ రావు ఆధ్వర్యంలో రైతుల పక్షాన నిలబడి షుగర్ ఫ్యాక్టరీ వెంటనే తెరిపించాలని నిరసనగా చిట్టాపూర్ గ్రామం నుండి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైన చెక్కర ఫ్యాక్టరీ మూసి వేయడమా?
 బి ఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి రైతులను మీద అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం బాధాకరమని అన్నారు. నడుస్తున్న ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మూసివేసిన ఘనత
బి.ఆర్.ఎస్ ప్రభుత్వందని అన్నారు. గత ఎన్నికల సమయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని కచ్చితంగా తెరిపిస్తానని హామీ ఇచ్చి ఒకవేళ తెరిపించకపోతే ఇదే ఫ్యాక్టరీ గేటుకి ఉరి వేసుకుంటానని అన్నారు. కానీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని అన్నారు. ఇప్పటికి కూడా చెరుకు రైతులు మరియు ఫ్యాక్టరీ కార్మికుల బాగు కోసం ఇసుమంతైన కృషిచేసిన దాఖలు లేదని  కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగ్ రావు మండిపడ్డారు.  .