కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు.

Published: Thursday January 27, 2022
మధిర జనవరి 26 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 73 వ గణతంత్ర వేడుకలను మధిర మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంసెట్టి కిషోర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై జాతీయ జండను ఎగురవేసి.. వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా సూరంసెట్టి కిషోర్ మాట్లాడుతూ.. 1947 ఆగస్టు నుండి మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలాలు బాపూజీ నాయకత్వంలో అనేక మంది దేశ నాయకులు మరియు ప్రజలు 1857 నుండి బ్రిటీష్ పాలనపై జరిపిన సుదీర్ఘ పోరాటాలు మరియు త్యాగాల ఫలితమే. అందరికీ సమాన హక్కులు - అవకాశాలతో తయారుచేసిన మన రాజ్యాంగ ప్రతిని 1950 జనవరి 26 న ఆమోదించడం జరిగింది. ఆ రోజు నుండి రిపబ్లిక్/గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆ మహోద్యమకారులందరికీ నివాళులు అర్పించి - ఎల్లవేళలా మన దేశాన్ని కాపాడుచున్న సైనికులను అభినందిస్తూ కరోనా నిబంధనలు పాటించుచూ నేడు 73వ గణతంత్ర దినోత్సవాన్ని సంతోషంగా జరువుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మధిర మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా బాలరాజు  మున్సిపల్ కౌన్సిలర్ కోన ధని కుమార్, మునుగోటి వెంకటేశ్వరరావు మధిర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ లు వనమా పిచ్చయ్య, కనకపుడి కరుణాకర్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు బిట్ర ఉద్దండయ్యా మండల st సెల్ నాయకులు తేజవత్ బాలునాయక్ పట్టణ ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు షేక్ బాజీ మండల సేవాడల్ అధ్యక్షుడు అదురీ శ్రీను మాజీ సర్పంచులు కర్నాటి రామారావు  కాంగ్రెస్ నాయకులు తలపుల వెంకటేశ్వర్లు, అల్లాడి గోపాల్ రావు, జమీల్ భాష, కోట డేవిడ్ ఆదిమూలం శ్రీనివాసరావు, సంపశాల రామకృష్ణ, బాణావత్ రమణ, బండారి నరసింహారావు, రహీం మైలవరపుచక్రి, సంగయ్య మొదలగు వారు పాల్గొన్నారు