ఘనంగా కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ జన్మదిన వేడుకలు

Published: Thursday December 16, 2021

కోరుట్ల, డిసెంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల పట్టణంలోనీ ఆదర్శనగర్ కాలనీ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ జన్మదిన వేడుకలు పట్టణ కాంగ్రెస్ మరియు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.