స్నేహితునికి సన్మానం

Published: Monday August 09, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామానికి చెందిన యువ కవి,రచయిత గాయకుడు, వనగంటి వెంకటేష్ భువనగిరిలోని స్టాన్ ఫోర్డ్ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా బోధిస్తున్నాడు. గత నెల 25న రవీంద్ర భారతిలో అబ్దుల్ కలాం జాతీయ పురస్కారం అందుకున్న సందర్భంగా తనతో పాటు చదువుకున్న విద్యార్థులు (పూర్వ విద్యార్థుల) స్నేహితులు ఆదివారం రోజున రెడ్లరేపాక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామానికి జాతీయస్థాయిలో పేరు తెచ్చినందుకు చాలా సంతోషమని అలాగే ఇంకా ఎన్నో అవార్డులు అందుకొని గ్రామానికి మంచి పేరు తీసుకరావాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మాద శంకర్ గౌడ్, కొమ్మ వెంకటేష్, బందారపు రవిశంకర్, నల్లమస మల్లేష్, అంబడి కృష్ణ,నరేందర్, మహ్మద్ గులాం హుస్సేన్, సిరికొండ జాంగిర్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.