హిందూ ఆచార,సాంప్రదాయాలాను గ్రామ ప్రజలకు గుర్తు చేస్తున్న సర్పంచ్ శివ నాగ కుమారి

Published: Monday March 21, 2022
మధిర మార్చి 27 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో ఆదివారం నాడు మాటూరు పేట గ్రామం సర్పంచ్ శివ నాగ కుమారి ఆధ్వర్యంలో నాడు పెళ్లి వేడుకల్లో నవ వదువుకి మంగళసూత్రం బహుకరణ. నేడు సీమంతం వేడుకలో నిండు గర్భిణీకి గాజులు, చీర ప్రధానం. ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమానికి కార్యశీలి సర్పంచ్ రావూరి శివనాగకుమారి.వేదిక మాటూరుపేట గ్రామంలాలించే దగ్గర నుండి పాలించే వరకు అన్నీ తానై ఉంటాను అంటున్న సర్పంచ్. ఇటీవల కాలంలో గ్రామంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో నవ వధువుకు మంగళసూత్రం బహూకరించి, నేడు గ్రామంలోని అంగన్వాడి సెంటర్లో జరిగే సీమంతం వేడుకల్లో గాజులు, చీర ప్రదానం చేసి హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను గుర్తు చేస్తూ, గ్రామంలో సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్న మాటూరుపేట గ్రామ సర్పంచ్ రావూరి శివనాగకుమారి. హిందూ సాంప్రదాయంలో వివాహం అయిన మహిళకు జరిగే వేడుక సీమంతం. అంటే నెలలుగర్భవతినిండిన భార్యకు ఆమె భర్త, కుటుంబ సభ్యులు కలిసి చేసే అతి ప్రధానమైన వేడుక.ఇల్లాలి సౌభాగ్యం, తనకు పుట్టబోయే బిడ్డ ఆయురారోగ్యాలతో వందేళ్లు జీవించాలని సంకల్పంతో చేసే కార్యక్రమమే సీమంతం. ఏశుభకార్యాల్లో లేని విధంగా సీమంతం వేడుకలో భార్య చేతికి గాజులు తొడిగి పండంటి బిడ్డకు జన్మను ఇమ్మని భర్తతో పాటు, శుభకార్యానికి విచ్చేసిన ప్రతి ఒక్క ముత్తైదువు ఆశీర్వదిస్తుంది. ఇటువంటి వేడుకకు మాటూరుపేట అంగన్వాడి సెంటర్ వేదికగా కాగా. కార్యశీలి సర్పంచ్రావూరు శివనాగకు మారి. గ్రామంలో లాలించే దగ్గర నుండి పాలించే వరకు అన్ని తానై ఉంటాను అంటున్న సర్పంచ్. ఇటువంటి సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్న సర్పంచికి గ్రామంలోని మహిళలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.