ప్రభుత్వం మొద్దు నిద్ర విడాలి : మాజీ మంత్రి ప్రసాద్ కుమార్

Published: Saturday July 30, 2022
వికారాబాద్ బ్యూరో 29 జూలై ప్రజాపాలన : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బ తిన్న పంటలు ఇళ్ళు రోడ్లను పరిశీలించామని కాంగ్రెస్ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలో  పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ పరిశీలించారు. ఈసందర్బంగా స్థానిక రాజీవ్ గృహకల్ప శివరాం నగర్ గిరిగేటపల్లిలో పరిస్థితిని సందర్శించారు. రాజీవ్ గృహకల్ప కౌన్సిలర్ జైదుపల్లి మురళి పిలుపు మేరకు పేద ప్రజలు జీవిస్తున్న గృహకల్పలో పరిస్థితి దయనీయంగా ఉందని ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు వేగవంతం చేయాలనీ పేర్కొన్నారు. అదే విధంగా స్థానిక ఎంఎల్ఎ ఫోటో ఫోజులతో కాలక్షేపం చేయకుండా  సీఎం దగ్గర నిధులు తీసుకొచ్చి వికారాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని  డిమాండ్ చేశారు. రోడ్ల పరిస్థితి ఘోరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పంట నష్టం జరిగి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి వర్షాల  వల్ల దెబ్బ తిన్న ప్రతి కుటుంబానికి 25 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో నష్ట పోయిన వారికీ 2 లక్షల రూపాయలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు మురళి వేణుగోపాల్ రెడ్డి రెడ్యానాయక్ అసిఫ్ సీనియర్ నాయకులు చామల రఘుపతి రెడ్డి నర్సిములు అనంత్ రెడ్డి కిష్టా రెడ్డి లక్ష్మణ్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ వెంకట్ రెడ్డి బుచ్చయ్య రత్నం రహీం బాదం అశోక్  రహీం జిలాని రాజేందర్ హన్మంతు నరేందర్ నవీన్ విజయ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.