యువతర్యాగింగ్ విద్యార్థులు దూరంగా ఉండాలి రూరల్ ఎస్సై నరేష్ మధిర

Published: Saturday March 04, 2023

రూరల్ మార్చ్ 3 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో శుక్రవారం నాడు యువత యువకులు ర్యాగింగ్ నుండి విద్యార్థులు దూరంగా ఉండాలని ర్యాగింగ్ పై  విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్న రూరల్ ఎస్సై నరేష్ నేటి సమాజంలో ర్యాగింగ్ అనేది విద్యాసంస్థల్లో విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుందని, ర్యాగింగ్ పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని ర్యాగింగ్ భూతాన్ని ప్రారదోలే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా కృషి చేయాలని, ఒక ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకొని విద్యపై దృష్టి సారించి ర్యాగింగ్ కు దూరంగా ఉంటూ ఉన్నత స్థానాలకు విద్యార్థులు చేరుకొని వారి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని మధిర మండల పరిధిలోని సిరిపురం జూనియర్ కళాశాల నందు ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమంలో మధిర రూరల్ ఎస్సై నరేష్ విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు