ప్రతి ఎకరంలో ఏరువాక సాగాలి

Published: Friday June 25, 2021
వికారాబాద్ జూన్ 24 ప్రజాపాలన బ్యూరో : ప్రతి ఎకరంలో రైతన్నలు ఏరువాక సాగించాలని జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు కింద ప్రతి గుంటకు పెట్టుబడి సాయం చేస్తుందని దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని సాగువిస్తీర్ణాన్ని పెంచాలని అన్నారు. ఆరుగాలం శ్రమించి ధాన్యం పండించే రైతులు దేశానికే అన్నదాతగా నిలిచారని కొనియాడారు. ఏరువాక పౌర్ణమి సంధర్బంగా రైతులు కాడెద్దులను పూజిస్తారని, ఈ ప్రక్రియ నిరంతరం చేయాలన్నారు. మూగ జీవాలకు సమయానికి మేత, నీళ్ళు తాపడం మరిచిపోకూడదని సూచించారు. ఎందుకంటే పశువులు నోరులేని మూగజీవాలు కాబట్టి వాటి పోషణలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి, పంటలతో రైతులు ఆర్థికాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సంధర్బంగా రైతాంగానికి ఏరువాక శుభాకాంక్షలు తెలిపారు.