దళిత బంధు పథకం దళితుల అందరికీ వర్తింప చేయాలి: వైయస్సార్ టిపి మండల నాయకులు

Published: Thursday October 06, 2022
బోనకల్, అక్టోబర్ 4 ప్రజా పాలన ప్రతినిధి:మండలంలో దళిత బందు 22 గ్రామాలకు వర్షింప చేయాలని, అర్హత కలిగి ఉన్న ప్రతి వ్యక్తికి దళిత బంధు అందించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బోనకల్ మండల యూత్ అధ్యక్షుడు మందా నాగరాజు , మండల అధ్యక్షుడు ఇరుగు జానేషు మండల అధికార ప్రతినిధి మర్రి ప్రేమ్ కుమార్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఉన్న దళిత కుటుంబాలకు ఆర్థిక స్తోమత లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారని, దళిత బంధు పథకాన్ని వర్తింపజేసి వారి జీవితములో వెలుగులు నింపాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. దళిత బంధువుపై చిన్నచూపు చూస్తూ దళితులను చిన్నచూపు చూస్తూ వారి కుటుంబాలపై దాడులు చేస్తూ పలు రకాల హింసిస్తూ వివక్షతకు గురి అవుతున్నారని అన్నారు. మనుషులంతా సమానమైన బావలతో ప్రతి ఒక్కరూ స్నేహపూర్వకంగా మెలగాలని ఈ కార్యక్రమంలో ముష్టికుంట గ్రామ అధ్యక్షుడు ఎస్.కె మౌలాలి, రామాపురం గ్రామ అధ్యక్షుడు దొంత గోపి, రావినూతల గ్రామ అధ్యక్షుడు తాళ్లూరి ఆరోను ,గార్లపాడు గ్రామ అధ్యక్షుడు కట్ల రాజయ్య, ఆళ్ళ పాడు గ్రామ అధ్యక్షుడు కందుల వెంకయ్య ,రాయనపేట గ్రామ అధ్యక్షుడు వెదల గోపి, మండల ఉపాధ్యక్షుడు ఎస్ డి సైదా బాబు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area