మే నెల 16 న సోమవారం జరిగే ఆదివాసి తెగల సాంస్కృతిక సమ్మేళనం కార్యక్రమానికి ఆహ్వానము.

Published: Monday May 16, 2022
భద్రాద్రి కొత్త గూడెం(ప్రజాపాలన బ్యూరో)ఆదివాసి జాతి కోసం,జాతి చైతన్యం కోసం,జాతి ప్రయోజనాల కోసం,జాతి అస్తిత్వం కోసం 16 మే 2022( సోమవారం) నాడు భద్రాచలంలో నిర్వహించబోతున్న  ఆదివాసి పోరాట యోధురాలు" రాణీ దుర్గావతి విగ్రహావిష్కరణ" మరియు " ఆదివాసీ  తెగల సాంస్కృతిక సమ్మేళనం"కార్యక్రమం విజవంతం  చేయడం కోసం తలపెట్టిన విషయం అందరికి తెలిసిందే.దీనిలో భాగంగా ఇది వరకే  జిల్లాలో ముఖ్యమైన కార్యకర్తల సమన్వయ సమావేశం నిర్వహించటం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లా మొత్తం ఆదివాసి ప్రజలు ఈ సాంస్కృతిక సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో మరియు ఆదివాసి ఉద్యోగస్తుల సంక్షేమ మరియు సాంస్కృతిక సంఘం మరియు ఆదివాసి మహిళా చైతన్య శక్తి అదేవిధంగా ఆదివాసి స్టూడెంట్స్ ఫోరం  మరియు ఆదివాసి తెగల ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం నిర్వహించ బడుతుంది.మే 16 సాయంత్రం 5 గంటల నుండి  బ్రిడ్జి సెంటర్ నుండి సాంస్కృతిక శోభ యాత్ర (కొమ్ము నృత్యం,రేలా బృందం,గుస్సాడి నృత్యం,అందెలు,నాయకపొడు నృత్యం,కొందరెడ్ల నృత్యం ఇలా ఆదివాసి తెగల నృత్యాలు జూనియర్ కాలేజి గ్రౌండ్స్ వరకు ఉంటాయి  అని ఆ తదుపరి  ఆదివాసి పోరాట యోధురాలు వీర వనిత రాణీ దుర్గావతి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం  ఉంటుంది అని తదుపరి  సంస్కృతిక కార్యక్రమాలు సమావేశం నిర్వహించటం జరుగుతుంది అని ఈ కార్యక్రమంలో ఆదివాసి రాజకీయ ప్రజా ప్రతినిధులు,ఆదివాసి తెగల ఉద్యమ నాయకులు కార్యకర్తలు అభిమానులు జిల్లా ఆదివాసి  ప్రజలు  ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుండి పాల్గొంటారు అని ఆదివాసి తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ మరియు ఆధార్ సొసైటీ ప్రతినిధి మెట్ల పాపయ్య గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో  భద్రాద్రి ఆదివాసి సమితి పూనెం కృష్ణ అధ్యక్షులు,పాయం రవి వర్మ కార్యదర్శి,వీరభద్రం సలహాదారు, స్థానిక మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం స్థానిక ఆదివాసి ఎమ్మెల్యే పోదేం వీరయ్య గారు ఈ కార్యక్రమ నిర్వహణ భాద్యతలను తీసుకున్నారు  అని అలానే ప్రముఖ ఆదివాసి డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ మరియు వాటి భాద్యతలను తీసుకున్నారు.
అదే విధంగా ఆదివాసి వివిధ శాఖల ఉద్యోగస్తులు వారి వంతు భాద్యతలను తీసుకున్నారు.
 అన్ని మండలాలకు కార్యక్రమ ప్రచార కరపత్రాలు పంపిణీ మరియు అందరికీ భాద్యతలు కేటాయింపు జరిగింది అని ఈ కార్యక్రమంలో ఆదివాసి తెగల సంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకత వుంది అని అలానే ప్రస్తుత ప్రజా ప్రతినిధులు మరియు మాజీ ప్రజా ప్రతినిధులు సర్పంచ్ లు ఎంపీపీ జడ్పీటీసీలు ఇలా ప్రతి ఒక్క ఆదివాసీ ప్రజాప్రతినిధులకు సంచారం అందిస్తున్నాము అని జాతి అస్తిత్వం కోసం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలని  ఈ కార్యక్రమానికి స్థానిక  ఆదివాసి మహిళలు  సుధారాణి,సులోచన,రమ,పద్మ, మంగవేని తదితరుల ఉద్యోగస్తులు వివిధ సంఘాల నాయకులు కార్యకర్తలు జాతి కోసం పని చేస్తున్నారు అని ఆదిలాబాద్ నుండి భద్రాచలం వరకు ఉన్న అందరూ ప్రతినిదులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అని  ఏఈడబ్ల్యూ సిఏ రాష్ట్ర సా0స్కృతిక  శాఖ బాధ్యులు కోండ్రు వీరాస్వామి, కృష్ణయ్య  మరియు కార్యక్రమ కోఆర్డినేటర్ కన్నారాజు సోయం,చింపిరయ్యా,వసంత్,ర్ప శ్రీను,రేసు లక్ష్మయ్య,రేసు రాంబాబు పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.