వి ఆర్ ఏ ల నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ

Published: Saturday July 30, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని అబ్దుల్లాపూర్మెట్ మండల్  వీ ఆర్ ఏలు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని తహసిల్దార్ కార్యాలయం వద్ద  నిరవధిక సమ్మె  నిర్వహించారు, సమ్మెలో పాల్గొనీ వారికి సంఘీభావంగా  మర్రి నిరంజన్ రెడ్డి  మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ వీఆర్ఏలకు ప్రగతి భవన్ అసెంబ్లీలో చెప్పిన మాటలు వెంటనే అమలు చేయాలని, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, వీఆర్ఏల స్కేల్ జీవోలను వెంటనే అమలు చేయాలని, అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్ కల్పించాలని, 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల స్థానంలో కుటుంబంలో ఒకరికి ఉద్యోగాలు కల్పించాలన్నారు, ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాలలో వీఆర్ఏల పాత్ర చాలా కీలకమని ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని మాట ఇచ్చి నేడు వారి సమస్యలను పరిష్కరించడం లేదని ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా తెలిపారు, ప్రతి కార్యక్రమంలో వీఆర్ఏల పాత్ర కీలకంగా ఉంటుందని   ఎట్టి చాకిరి చేస్తూ  తమ సమస్యలు పరిష్కరించాలని దశలవారీగా అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్నారు, ఆ పోరాటాలలో భాగంగానే ఈరోజు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె  నిరాహార దీక్షలు చేపడుతున్నారని తెలిపారు ,ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు, దీనికి కాంగ్రెస్ పార్టీ పూర్తి  మద్దతు ఇస్తూ  మా సహాయ సహకారాలు ఉంటాయని మర్రి నిరంజన్ రెడ్డి  తెలిపారు, ఈ సందర్భంలో తమ దీక్షకు సంఘీభావం తెలపడానికి విచ్చేసిన మర్రి నిరంజన్ రెడ్డి కి వీఆర్ఏలు కృతజ్ఞతలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్మెట్ మండల గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షులు ఇరుగు ప్రసాద్, ఉపాధ్యక్షులు జింక ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి ఎలిమినేటి శ్రీకాంత్ రెడ్డి, మరియు నాతి శ్రీనివాస్ జాల ముత్యాలు, చెరుకు ఇందిరా, వివిధ గ్రామాల వీఆర్వోలు ,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.