క్రియాశీల రాజకీయాలకు దూరం కానున్న పల్లపోతు ప్రసాదరావుసేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టే

Published: Thursday September 29, 2022

మధిర సెప్టెంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి మధిర సేవా సమితి అధ్యక్షులు రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ సంఘం కన్వీనర్ పల్లబోతు ప్రసాదరావు క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారు. ప్రస్తుతం ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ సంఘం కన్వీనర్ గా మధిర సేవా సమితి అధ్యక్షులుగా అనేక సంవత్సరాలుగా మధిరలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాలకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. పల్లపోతు ప్రసాదరావు అధికార పార్టీలో ఉండి మధిర సేవా సమితి కార్యక్రమాలకు ప్రతిపక్ష నాయకులను పిలిచినప్పుడు అధికార పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో పల్లపోతు ప్రసాద రావు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. మధిర ఆర్యవైశ్య ల్లో పల్లపోతు ప్రసాదరావు కీలకమైన వ్యక్తి. టిడిపిలో జిల్లా వాణిజ్య సంఘం అధ్యక్షులుగా, కాంగ్రెస్, టిఆర్ఎస్ లో పట్టణ నాయకులుగా ఉంటూ ఆయా పార్టీలు బలోపేతం కోసం కృషి చేశారు. కరోనా సమయంలో పట్టణంలో పేదలందరికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మహిళలకు సబ్సిడీపై కుట్టు మిషన్లు, చిరువ్యాపారులకు రుణాలు గొడుగులు, మాస్కులు,  అందించారు. మధిరలో పల్లపోతు ప్రసాదరావు చేసిన అనేక సేవా కార్యక్రమాలను గుర్తించిన ఉమ్మడి రాష్ట్రంలోని పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అనేక పురస్కారాలను పల్లపోతు ప్రసాద రావు అందుకున్నారు.