ఆపరేషన్ స్మైల్ •09 విజయవంతం ** అదనపు ఎస్పీ అచ్చేశ్వర్ రావు **

Published: Thursday February 02, 2023
జిల్లావ్యాప్తంగా 43 మందికి రక్షణ **
 
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి01 (ప్రజాపాలన,ప్రతినిధి) : ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా బాలలకు హక్కులను కల్పించడానికి ఆపరేషన్ స్మైల్  09,జనవరి 1 నుండి 31వరకు చేసిన రెస్క్ ఆపరేషన్ కృషి లభించిందని జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ అచ్చేశ్వర్ రావు బుధవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీఅచ్చేశ్వర్ రావు మాట్లాడుతూ జిల్లాలో రెండు డివిజన్లలో కలిపి మొత్తం 43 మంది బాల బాలికలను గుర్తించినట్లు వివరించారు. ఆసిఫాబాద్ డివిజన్లో 21 మంది, కాగజ్ నగర్ డివిజన్లో 22 మంది బాలబాలికలు, మొత్తం 42 మంది బాలురు కాగా,1బాలిక ఉందన్నారు. ఈ ఆపరేషన్ లో పోలీస్ శాఖ, విద్యాశాఖ, రెవిన్యూ, కార్మిక, బాలల రక్షణ విభాగం అధికారులు ఉన్నారన్నారు. జిల్లాలో ఉన్న కార్మికులను గుర్తించి వాళ్ళని బడిలో చేర్పించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్న వారిపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.18 ఏళ్ల లోపు ఉన్న పిల్లలను పనిలో పెట్టుకున్న యాజమాన్యాలకు జరిమానాలు విధించారు. చిన్నారుల తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి, తీసుకునే చర్యలపై అవగాహన కల్పించారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమానికి ఆసిఫాబాద్ డివిజన్ ఇన్చార్జిగా ఎస్సై రామన్, కాగజ్నగర్ డివిజన్ ఇన్చార్జిగా ఎస్సై అబ్దుల్ సత్తార్ లను స్మైల్ 09 బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ ఆఫీసర్ మహేష్, సుధాకర్,వెల్ఫేర్ ఆఫీసర్ సావిత్రి, సత్యనారాయణ,సూర్య కళ, షీ టీం ఇన్చార్జి ఎస్సై రాజేశ్వర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.