లోక ఆదాలత్ లను సద్వినియోగం చేసుకోండి, ఏసిపి రెహ్మాన్

Published: Thursday July 08, 2021

బెల్లంపల్లి, జూలై 7, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో వివిధ కేసుల్లో ఉన్నా ఫిర్యాదుదారులు మరియు అభియోగం మోపబడిన వ్యక్తులు రాజీకి వచ్చి కేసులను రద్దు చేసుకునే విధంగా లోక్ అదాలత్ లను ఉపయోగించుకోవాలని బెల్లంపల్లి ఏసిపి రెహ్మాన్ తెలిపారు. బుధవారం నాడు ఆయన ప్రకటన విడుదల చేస్తూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి సబ్ డివిజన్ లో గల తాండూర్, బెల్లంపల్లి, మందమర్రి, దేవాపూర్, పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఉన్నటువంటి ఫిర్యాదుదారులు మరియు అభియోగం మోపబడిన వ్యక్తులు వారి కేసుల విషయమై రాజితో పరిష్కరించుకునే విధంగా ఆసక్తిగలవారు ఈ నెల 10వ తేదీన బెల్లంపల్లి మరియు మంచిర్యాల కోర్టులలో జరిగే లోక్ అదాలత్ లకు హాజరై వారి కేసులను పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు. ఈ లోక్ అదాలతులలో పోలీస్ స్టేషన్లలో నమోదైన చార్జిషీట్ దాఖలు అయినా రాజీ కి అనుకూలమైన సెక్షన్ లో ఉన్న కేసులను మరియు లాక్డౌన్ సమయంలో విధించినటువంటి కేసులను పరిష్కరించుకోవాలని ఈ విషయమై సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ను గాని కోర్టు కానిస్టేబుల్ ను గాని సంప్రదించి ఆయా కేసులను పరిష్కరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.