గిజనేతరులు మా భూముల ను ఆక్రమించుకుంటున్నారు. .. ఐ.టి.డి.ఎ. పి. ఒ. పిర్యాదు చేసిన నాయికపోడ్ సేవాసం

Published: Wednesday September 07, 2022
మందమర్రి, సెప్టెంబర్ 06, ప్రజాపాలన :  మంచిర్యాల జిల్లా  మందమర్రి పట్టణంలోని ఎజెన్సీ ప్రాంతాల్లో ఉట్నూర్ సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్  వరుణ్ రెడ్డి మంగళవారం  పర్యటించారు. ఈ సందర్బంగా ఆదివాసీ నాయక్ పోడు సేవా సంఘం నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మందమర్రి పట్టణ ఏజెన్సీ ప్రాంతం లో అక్రమంగా వెలుస్తున్న వెంచర్ల గురించి, రియల్టర్ ల వల్ల స్థానిక  ఆదివాసీ నాయకపోడు లు మోస పోతున్నారని పిఓ దృష్టికి తీసుకువచ్చారు. ఆదివాసులను బెదిరిస్తున్నారని, సీలింగ్ పట్టాలను సైతం గిరిజనేతరులు తమ   భూములను లాక్కొని అక్రమ నిర్మాణాలు, బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు .  మందమర్రి మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు  రియల్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పిర్యాదు చేశారు.   ఇప్పటికైనా మందమర్రి ఏజెన్సీ ప్రాంతం లో అక్రమ నిర్మాణాలను, అక్రమ వెంచర్లను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడు మంచిర్యాల జిల్లా  అధ్యక్షులు లవుడం రాజ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంజి రాజన్న, కోశాధికారి మేసినేని అరుణ్ కుమార్, ప్రచార కార్యదర్శి పాలమాకుల బీమ్ సేన్ తదితరులు ఉన్నారు.