పీర్జాదిగూడ కార్పొరేషన్లో రూ 4.26 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్

Published: Friday September 17, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి అధ్వర్యంలో దాదాపు రూ 4.26 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కూడిన పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలోని11వ డివిజన్ పరిధిలోని బుద్దా నగర్ కాలనీలో రూ10.00 లక్షల అంచనా వ్యయంతో కూడిన సి.సి రోడ్డు పనులు ప్రారంభించారు. 1వ డివిజన్ పరిధిలోని మేడిపల్లిలో సమీకృత అత్యాధునిక సదుపాయాలతో రూ 1.00కోటి అంచనా వ్యయంతో కూడిన స్మశాన వాటిక అభివృద్ధి పనులు ప్రారంభించారు. 4వ డివిజన్ పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీలో రూ 25.00 లక్షల అంచనా వ్యయంతో కూడిన సి.సి రోడ్డు పనులు ప్రారంభించారు. 5వ డివిజన్ పరిధిలోని పర్వతాపూర్ పాత గ్రామంలో రూ 12.00 లక్షల అంచనా వ్యయంతో కూడిన సి.సి రోడ్డు పనులు మరియు  మల్లికార్జున నగర్ కాలనీ ఫేస్-2లో రూ 15.30 లక్షల అంచనా వ్యయంతో కూడిన సి.సి రోడ్డు పనులు ప్రారంభించారు.19వ డివిజన్ పరిధిలోని  రామకృష్ణ నగర్ కాలనీలో రూ18.00 లక్షల అంచనా వ్యయంతో కూడిన పార్క్ అభివృద్ధి పనులు ప్రారంభించారు. 16వ డివిజన్ పరిధిలోని శంకర్ నగర్ కాలనీలో రూ 16.00 లక్షల అంచనా వ్యయంతో కూడిన సి.సి రోడ్డు పనులు మరియు శ్రీపాద ఎంక్లేవ్ లో రూ 16.00 లక్షల అంచనా వ్యయంతో కూడిన  అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల ప్రారంభించారు.2వ డివిజన్ పరిధిలోని పంచవటి కాలనీలో రూ 24.00 లక్షల అంచనా వ్యయంతో కూడిన సి.సి రోడ్డు పనులను ప్రారంభించారు. 25వ డివిజన్ పరిధిలోని మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు అంతస్తు రూ40.00 లక్షల అంచనా వ్యయంతో కూడిన నిర్మాణ పనులు ప్రారంభించారు.అదేవిదంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పూర్తిస్తాయిలో రూ 1.50 కోట్ల రూపాయల అంచాన వ్యయంతో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసే కార్యక్రమానికి శంఖుస్థాపన చేసారు.ఈ సందర్భంగా మంత్రి చామకూర మల్లారెడ్డి  మాట్లాడుతూ పీర్జాదిగూడ అభివృద్దిలో అగ్రస్తానంలో ఉందని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, మరియు 100 శాతం సీసీ కెమెరాలు ఏర్పాటులో రాష్ట్రంలోనే పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ మొదటి స్థానంలో  ఉండబోతుందన్నందున మేయర్, డిప్యూటి మేయర్ మరియు పాలక మండలిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కమీషనర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు