మండలంలోని గ్రామాల కుండ అక్రమ ఇసుక రవాణా

Published: Tuesday February 14, 2023

జన్నారం, ఫిబ్రవరి 13, ప్రజాపాలన: మండలంలోని ధర్మారం, బాదంపల్లి, చింతగూడ, తపాల్పూర్, రోటి గూడ, ప్రాంతాల గుండ అక్రమ ఇసుక దందా కొనసాగుతుంది. అధికారుల అండతో గోదావరి పరిసర ప్రాంతాల నుండి ఇసుక రవాణా జోరుగా కొనసాగిస్తున్నారు. గోదావరి నది, వాగులు అటవీ ప్రాంతం పరిసర ప్రాంతాల నుండి ప్రతిరోజు రాత్రి, పగలు సమయం లేకుండా రహదారి గుండాల ట్రాక్టర్లులతో ఇసుకను తోడేస్తున్నారు. ట్రాక్టర్లతో ఇసుకను తీసుకువస్తే స్థానిక అధికారులు చూచి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మండలంలోని గ్రామాల గుండా ట్రాక్టర్లు అధిక వేగంతో వెళ్లడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. మండలంలోని  పరిసర ప్రాంతాలు గోదావరి నది కుండ ఇసుక తీయడానికి ప్రభుత్వం తరఫున టెండర్ వేయడం జరగలేదు కానీ అక్రమ ఇసుక తీసుకువచ్చి అధికారుల అండదండలతో ఇసుక మాఫియా దారులు సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని ప్రాంతాల గుండా అక్రమ ఇసుక కొనసాగుతుందని ఇసుక రవాణా కొనసాగుతుందని అధికారులకు తెలియపరచినప్పటికీ పట్టించుకోవడం జరుగుతలేదన్నారు. గోదావరి పరిసర ప్రాంతాల నుండి అక్రమ ఇసుక తీయడంతో గ్రామాలలో భూగర్భ జలాలు అడుగంటి పోయే అవకాశాలు ఉన్నాయని స్థానిక ప్రాంత గ్రామాల ప్రజలు వాపోతున్నారు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్, అటవీ అధికారులు స్పందించి అక్రమా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ లను సీజ్ చేయాలని స్థానిక గ్రామస్తులు కోరుచున్నారు. గోదావరి నుండి అక్రమ ఇసుక రవాణా చేయడం ట్రాక్టర్ యజమానుడు లక్షలాది రూపాయలు సొమ్ముచేసుకుంటున్నారు