రవాణా రంగాన్ని కాపాడండి

Published: Friday May 20, 2022

ఇబ్రహీంపట్నం మార్చి తేది 19 ప్రజాపాలన ప్రతినిధి.డ్రైవర్ & ఓనర్స్ కు చేయూత నివ్వండి*

*రాష్ట్ర రవాణా బంద్ ను జయప్రదం చేస్తూ యాచారం చౌరస్తా లో నిరసన*

*ఫిట్నెస్ రెన్యువల్ పై రోజుకు రూ.50/-లు పెనాల్టీ రద్దుచేయాలి*

*కార్మికుల నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.*

*CITU రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పెండ్యాల బ్రహ్మయ్య డిమాండ్*

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2019 సంవత్సరంలో మోటార్ వాహనాల చట్టం 2019 ని  సేఫ్టీ పేరుతో భారీ చలాన్లు పెంచుతూ  ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనిని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో యాచారం మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లు నిరసన చేయడం జరిగింది
ఈ సందర్బంగా  సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పెండ్యాల బ్రహ్మయ్య మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా మోటార్ వాహన యజమానులు మరియు కార్మికులు నడ్డి విరిచి వేలాది, లక్షలాది రూపాయల పెనాల్టీలు , భారాలు వేసి,కార్మికుల బతుకులపైన పెను భారం మోపుతోంది. అదేవిధంగా వాహన కొనుగోలు దానిపైన తెలంగాణ ప్రభుత్వం పన్నుల భారం మోపింది.  వాహనాల జీవితకాల పన్ను  రెండు మూడు అంచెలుగా పెంచింది. లక్ష రూపాయలు ఇచ్చి ద్విచక్ర వాహనం కొనుగోలు చేస్తే ఇప్పటివరకు 9,000 చెల్లిస్తే సరిపోయేది. కానీ ఇకనుంచి 12000 జీవితకాల పన్ను చెల్లించాలి. అంటే అదనంగా మూడు వేల రూపాయలు పెంచింది. ఇలా అన్ని వాహనాల పైన విపరీతమైన పన్నులను పెంచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ 1 నుండి జీవో నెంబర్ 714 ప్రకారం ఫిట్నెస్ రెన్యువల్  గడువు అయిన తర్వాత రోజుకు  50 రూపాయల చొప్పున పెనాల్టీలు వేస్తున్నారు. ఒక్కొక్క వాహనానికి రెండు, మూడు సంవత్సరాల ఫిట్నెస్ను పెండింగ్లో ఉన్నవి. ఎందుకంటే కరోనా వలన ఆటో,క్యాబ్,లారీ కార్మికులు తీవ్ర నష్టాన్ని చవి చూశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఖజానా నింపుకోవడానికి ఆటో,క్యాబ్, లారీ కార్మికులపై భారీ జరిమానా విధించడానికి పూనుకున్నాయి. ఈ విధానం అమలు చేస్తే కార్మికులు అందరూ వారి వాహనాలను అమ్ముకున్న చెల్లించలేని పరిస్థితిలో కార్మికులు ఉన్నారు. కావున వెంటనే రోజు 50 రూపాయల పెనాల్టీని రద్దు చేసి రవాణా రంగ కార్మికులు ఆదుకోవాలి.ఫీట్నెస్ రెన్యూవల్ పై రోజుకు 50 రూపాయల ఫెనాల్టీ రద్దు మరియు రోడ్ సేఫ్టీ బిల్లును 2019 రద్దు చేయాలి. పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు తగ్గించాలి. బ్యాడ్జి నెంబర్ పునరుద్ధరణపై పెనాల్టీ మినహాయించాలి.ఈ కార్యక్రమం లో ఆటో యూనియన్ అధ్యక్షుడు అలంపల్లి యాదయ్య, వెంకటేష్ డవలయ్య. పాండు. శ్రీరాములు.శంకరయ్య. మల్లేష్.యాదయ్య. రాజు.మైసయ్య.తదితరులు పాల్గొన్నారు.