ధాన్యం కొనుగోలు విజయవంతం ..

Published: Saturday June 26, 2021
పాలేరు, జూన్ 25, (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా:- పాలేరు నియోజకవర్గంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు విజయవంతంగా ముగించినందుకు కూసుమంచి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, కలెక్టర్ కర్ణన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో అధికారులు కష్టపడి రైతులు నష్టపోకుండా ప్రతిగింజ కొనుగోలు చేశారన్నారు. వర్షాకాలం సీజన్ కు రైతులు పంటలు వేసుకునేందుకు సిద్ధం కావాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకుని రైతులు అధిక దిగుబడులు సాధించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్ వీ కర్ణన్ ను ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, టిఆర్ఎస్ పార్టీ నేలకొండపల్లి మండల అధ్యక్షులు ఉన్నాం బ్రహ్మయ్య, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, కూసుమంచి మండలం పార్టీ అధ్యక్షులు చాట్ల పరుశురాం, ఎంపీపీలు బెల్లం ఉమా, బి శ్రీనివాసరావు, డిసిసిబి డైరెక్టర్ ఇంటురి శేఖర్, డీసీఎంఎస్ డైరెక్టర్ నాగబండి శ్రీనివాసరావు, ఆత్మ చైర్మన్ రామసాయం బాలకృష్ణ రెడ్డి, వ్యవసాయ శాఖ మరియు వివిధ రకాల అధికారులు పాల్గొన్నారు