విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రగతి భవన్ ముట్టడిస్తాం. గవ్వ వంశీధర్ రెడ్డి

Published: Friday December 23, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 22 ప్రజా పాలన ప్రతినిధి: విద్యారంగ సమస్యల్ని వెంటనే పరిష్కరించకపోతే, ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని ఏఐఎస్బి రాష్ట్ర కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి అన్నారు.
గురువారం నాడు స్థానిక లక్ష్మీనరసింహ ఒకేషనల్ కళాశాలలో అఖిల భారత విద్యార్థి సంఘం జిల్లా నాయకులు అల్లి సాగర్ ఆధ్వర్యంలో జరిగిన విస్తృతస్థాయి  సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు,
 తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులపై సవితి తల్లి ప్రేమచూపిస్తుందని,సరైన సౌకర్యాలు కల్పించడం లేదని అన్నారు.
ప్రజాప్రతినిధుల జీతాలు పెంచుతున్నారే తప్ప, విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచడం లేదని, విద్యుత్తు, నీళ్ల, సమస్యలతో పాటు,పక్క భవనాలు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అపరిస్కృతంగా ఉన్న స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్ మెంట్ నిధులను విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ, విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారని అన్నారు.
మిక్స్డ్ ఆక్యుపెన్సీ కారణంగా చూపిస్తూ, కొన్ని కళాశాలలకు లాగిన్ పర్మిషన్ ఇచ్చి,మరికొన్ని కళాశాలలకు పర్మిషన్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని,వెంటనే విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని,విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ప్రగతి భవన్  ముట్టడి చేపడుతామని ఆయన హెచ్చరించారు. 
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉదృతం చేస్తామని,ఏఐఎస్బీ  ఆధ్వర్యంలో అసెంబ్లీ ముందు ఆమరణ నిరాహారదీక్షను చేపడుతామని అన్నారు.
అనంతరం 50 మంది విద్యార్థులకు కండువాలు కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు.
ఈకార్యక్రమంలో ఏఐఎస్ బీ నాయకులు  వెంకటేష్, బియ్యాల ప్రశాంత్,మనోహర్,రాకేష్,అవినాష్,అఖిల్,నితీష్,ప్రేంసాయి తదితరులు పాల్గొన్నారు.