రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించాలి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాలి దుర్గ

Published: Thursday December 01, 2022
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు బుధవారం మధిర పట్టణంలో భారీ ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించటం జరిగింది.ఈ కార్యక్రమానికి బోనకల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాలి దుర్గారావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున మండల నాయకులు, రైతులు హాజరయ్యారు.ముందుగా మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి తాసిల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని తాసిల్దార్ కి ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులూ వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు మాట్లడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించాలని, కోరారు.ఏకకాలంలో వెంటనే రుణమాఫీ,గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాల వలన జరిగిన పంట నష్టాలకు వెంటనే నష్టపరిహారం,ధరణి పోర్టల్ ను వెంటనే రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని, సమగ్ర భూసర్వే జరిపి నిజమైన హక్కు దారులకు పట్టా పాసు పుస్తకాలు పంపిణీ చేయాలనీ డిమాండ్ చేశారు. వివాదాస్పద భూములకు గ్రామా సభలు నిర్వహించి భూ సమస్యలు పరిష్కారం చేపట్టాలని,ఆన్ లైన్ మాత్రమే కాకుండా మాన్యువల్ రికార్డులను కూడా ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు.2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి అర్హులైన అందరికి హక్కు పత్రాలు,2014 నాటికే దరఖాస్తులు పెట్టుకొని పట్టాలు ఇవ్వని వారికి చట్ట పరంగా తగిన చర్యలు తీసుకొని హక్కు పత్రాలు అందించాలని అన్నారు.ప్రస్తుతం ధాన్యం చేతికొస్తున్న తరుణంలో కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన వెంటనే రైతులకు ట్రాక్ సిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.దాన్యం కొనుగోలులో తరుగు పేరుతో గత రెండు, మూడు సంవత్సరాలుగా మిల్లర్లు చేసిన దోపిడీ మిద పూర్తి విచారణ జరపాలని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రైతు పోరుబాట ధర్నాలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనియెడల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో రైతులతో ప్రగతి భవన్ సైతం ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు,గోవిందాపురం(ఏ) గ్రామ సర్పంచ్ భాగం శ్రీనివాసరావు,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భూక్యా శ్రీనివాసరావు,యువజన కాంగ్రెస్ నాయకులు ఎసుపోగు హేమూన్,బీసీ సెల్ మండల కమిటీ సభ్యులు పంది రామారావు,బుడుగు జంగాల మండల అధ్యక్షుడు శ్రిపాటి నాగరాజు,పెద్దబీరవల్లి గ్రామ ఎస్సి సెల్ నాయకులు గండమాల రామరావు,గొరెముచ్చు ఆనందరావు,ఆయా గ్రామాల అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు.