సిపిఐ సీనియర్ నాకుడు యలమద్ది కృష్ణ భౌతిక కాయం పై పూల మాలవేసి నివాళులు అర్పిస్తున్న భాగం హేమం

Published: Thursday May 06, 2021

మధిర, మే 5, ప్రజాపాలన ప్రతినిధి : మడుపల్లి గ్రామానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు సిపిఐ సీనియర్ నాయకుడు కామ్రేడ్ యలమద్ది కృష్ణ గారు గుండెపోటు తో రాత్రి 11 గంటలకు మరణించారు, రాష్ట్ర వ్యవసాయకార్మిక సంఘ నాయకుడిగా అనేక కూలి పోరాటలు నిర్వహించి కూలీలకు అండగా ఉండే కృష్ణగారి మరణం సిపిఐ కి తీరని లోటు అని పోటు ప్రసాద్ పేర్కొన్నారు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్రావు, సిపిఐ పట్టణకార్యదర్శి బెజవాడ రవి, పెరుమాళ్ళపల్లి ప్రకాశరావు, మురళి, నాగకృష్ణ, సత్యం, చెరుకూరి వెంకటేశ్వరరావు, శ్రీను మొదలగు వారు పాల్గొని ఘననివాలి అర్పించారు