దుబాయిలో ఘనంగా గణపతి నిమజ్జనం ...తెలంగాణ ప్రజలను ఆయురారోగ్యాల తో ఉంచాలని కోరుకున్న వలస కార్మ

Published: Monday September 05, 2022
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్04, ప్రజాపాలన:
 
దేవుడు విశ్వాంతర్యామీ , హిందువులు ఏకండంలో ఉన్నా వారి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో
ఎడారి దేశంలో  ఉన్న హిందు వలస కార్మికులు  సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తు వైభవోపేతంగా   తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి  ఆధ్వర్యంలో  దుబాయ్ లో గణపతి  ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  వ్యవస్థాపక అధ్యక్షులు కల్లెడ భూమయ్య ప్రజాపాలన తో మాట్లాడుతూ  వినాయక విగ్రహానికి   ఐదు రోజలపాటు పూజలు చేసి ఆదివారం  నిమజ్జనం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు అయినా  ఇప్పటికీ గల్ఫ్ కార్మికులకు  ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చేలా , పోరుగు రాష్ట్రాలైన పంజాబ్, బీహార్ వలస కార్మికులకు ఎక్స్గ్రేషియా చేయడం కాకుండా సొంత రాష్ట్ర గల్ఫ్ లో మరణించిన వలస కార్మికులకు రూ.10  లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చేలా రాష్ట్ర ముఖ్యమంత్రి  మనసు మార్చాలా చేయాలని గణపతి కి ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.  అదేవిధంగా పుట్టిన దేశంలో ప్రజలందరూ  బాగుండాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకోవడం జరిగిందని  ఆయన శరవాణి ద్వారా తెలిపారు. ఈ పూజా కార్యక్రమలలో  తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి  కడెం మండల ఇంచార్జ్ ధర్మాజీ సత్తన్న.(  బార్ దుబాయ్)  కోఆర్డినేటర్ కునారపు రమేష్, కుక్కల రాంరెడ్డి సంగేపు గంగారం, నంబయ్య, శ్రీనివాస్,కల్లేడ నరేష్, సత్యం, సాయి, పందిరి చంద్రయ్య, బిల్లవేణి గణేష్, పందిరి మహేష్, మేడి రామన్న, లింగన్న, గుమ్ముల సాయి తదితరులు పాల్గొన్నారు.